వృద్ధ తల్లిదండ్రులను వేధించి నిర్లక్ష్యం చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి డాక్టర్ ఏ కృష్ణ ప్రసాద్ అన్నారు. ప్రపంచ వయోవృద్ధులపై వేధింపుల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆదివారం విజయనగరం పూల్ బాగ్ లో ఉన్న ప్రేమ సమాజం వృద్ధాశ్రమంను సందర్శించారు. వయోవృద్ధులకు సంబంధించిన చట్టాలు, హక్కులు గురించి అవగాహన కల్పించారు.