సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాస్ కేసులో సుప్రీం కోర్టు తీర్పు హర్షణీయమని జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పేర్కొన్నారు. వెంటనే విడుదల చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించడాన్ని ఆయన శుక్రవారం స్వాగతించారు. ఇది ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే తీర్పుగా పేర్కొన్నారు. సుప్రీం వ్యాఖ్యలు ప్రభుత్వ వైఖరికి చెంప పెట్టుతో సమానమన్నారు. ప్రభుత్వ పాలన గాడితప్పినదిగా ఈ తీర్పు హెచ్చరికలా ఉందన్నారు.