రాజ్యాంగంలో అందరికీ సమానత్వం కల్పించిన మహనీయుడు డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ అని ఎస్పి వకుల్ జిందాల్ అన్నారు. సోమవారం ఆయన కార్యాలయంలో బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. మహిళలకు ఎక్కడ సముచిత స్థానం ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుందని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడుచుకోవాలని పిలుపునిచ్చారు.