విజయనగరం: ఈనెల 9న జరగనున్న జాతీయ సమ్మెను జయప్రదం చేయాలి

4చూసినవారు
విజయనగరం: ఈనెల 9న జరగనున్న జాతీయ సమ్మెను జయప్రదం చేయాలి
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఈనెల 9 న చేపట్టనున్న జాతీయ సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కే సురేష్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన విజయనగరం ఎల్పిజి భవన్ లో పలు ప్రజాసంఘాల నాయకులతో సమావేశమయ్యారు. లేబర్ కోడ్ లను రద్దు, సమాన పనికి సమాన వేతనం తదితర డిమాండ్లతో సమ్మె చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో గోడ పత్రికను ఆవిష్కరించారు.

సంబంధిత పోస్ట్