విజయనగరం: వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలి

76చూసినవారు
ముస్లింలకు నష్టం కలిగించే వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని ముస్లింలు నినదించారు. బుధవారం విజయనగరంలో ముస్లింలు అబాద్ వీధి నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం యువకులు, మహిళలు ప్లకార్డులతో కేంద్ర ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వక్ఫ్ ఆస్తులు ప్రభుత్వానికో, ఏ సంస్థకో చెందినవి కావని, ముస్లిముల అభివృద్ధి కోసం పూర్వీకులు దానధర్మాలు చేసి ఇచ్చిన ఆస్తులని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్