విజయనగరం మహిళా పోలిస్ స్టషన్లో 2018లో నమోదైన వరకట్న వేధింపుల కేసులో ముగ్గురికి ఏడాది చొప్పున సాధారణ జైలుశిక్ష, రూ. 51వేలు జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు చెప్పిందని డిఎస్పీ గోవిందరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నగరానికి చెందిన జాషువాకు తమిళనాడుకు చెందిన ఓ మహిళతో వివాహం జరిగింది. భర్త, అత్త, మామలు అదనపు కట్నం కోసం వేదించడంతో మహిళ పిఎస్ల్ లో కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో శిక్ష విధించారు.