పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా బుధవారం విజయనగరం పట్టణం మూడు లాంతర్లు కూడలి నుంచి కోట కూడలి వరకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. అదనపు ఎస్పీ పి. సౌమ్యలత ర్యాలీని ప్రారంభించారు. పోలీస్ అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ జి. నాగేశ్వరరావు, డీఎస్పీలు, సీఐ, ఎస్ఐలు పాల్గొన్నారు.