ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని ఎస్పి వకుల్ జిందాల్ కోరారు. ఆదివారం ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ. రహదారి ప్రమాదాల్లో హెల్మెట్ ధరించని కారణంగా 50 శాతం మరణాలు సంభవిస్తున్నట్లు తెలిపారు. వేగం కన్నా సురక్షిత ప్రయాణం ప్రధానమని అన్నారు. హెల్మెట్ ధరించని వాహనదారులపై ఎమ్ వి నిబంధనలు అతిక్రమించినట్లు పరిగణించి ఈ - చలానాలు విధించాలని పోలీసు అధికారులకు ఆదేశించారు.