విజయనగరం జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూన్ 17న అండర్–16 బాలుర క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు. విజ్జి క్రికెట్ మైదానంలో ఉదయం 7.30కు ప్రారంభమయ్యే ఈ ఎంపికలకు 2009 సెప్టెంబర్ 1 తర్వాత జన్మించినవారు అర్హులు. క్రీడాకారులు ఒరిజినల్ ఆధార్, జనన సర్టిఫికేట్, 3 ఏళ్ల స్టడీ సర్టిఫికెట్లు, వైట్ డ్రెస్, సొంత కిట్‌తో హాజరుకావాలి.