విజయనగరం జిల్లాలో గాజులరేగలో గల శ్రీ ముత్యాలమ్మ తల్లిని జనసేన నాయకులు అవనాపు విక్రమ్ మంగళవారం దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు ఉత్సవ కమిటీ సభ్యులు సాదర స్వాగతం పలికారు. దుస్సాలువాతో సత్కరించి అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించారు. అనంతరం ఉత్సవ నేపథ్యంలో ఏర్పాటుచేసిన మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని విక్రమ్ ప్రారంభించారు.