తెలుగు నాటకరంగ దినోత్సవాన్ని బుధవారం శ్రీ సాయి కృష్ణా వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక అయ్యన్నపేట జంక్షన్ వద్దనున్న నడక మైదానంలో క్లబ్ అధ్యక్షుడు తాడ్డి ఆదినారాయణ నిర్వహించారు. క్లబ్ సభ్యులంతా తెలుగు నాటక రంగానికి ఎనలేని కృషి, సేవలందిస్తున్న, నటులు, ప్రముఖ కళాకారులు రాంబర్కి రామానాయుడును సత్కరించారు. నాటకరంగం హైటెక్ యుగంలో సెల్ ఫోన్ ప్రభావంతో మసకబారుతొందని క్లబ్ గౌరవ అధ్యక్షులు ప్రకాశరావు అన్నారు.