విజయనగరం జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల 14న 5,900 వేదికల్లో యోగా డెమో నిర్వహించనున్నారు. ఈ మేరకు సంయుక్త కలెక్టర్ సేతు మాధవన్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. రెండో విడతలో లక్ష మందికి యోగా శిక్షణ ఇవ్వనున్నామని వివరించారు. డీఎల్డీవోలు, ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు ఈ కార్యక్రమాలను పర్యవేక్షించాలని ఆదేశించారు.