ఆంద్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి జిల్లా పర్యటనలో బాగంగా ఈనెల19న విజయనగరం విచ్చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టి జిల్లా అధ్యక్షులు మరిపి విద్యాసాగర్ బుధవారం తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశ్యంతో పర్యటిస్తున్నారని, విజయవంతం చేయాలని విద్యాసాగర్ కోరారు. ఈ మేరకు పలు ఏర్పాట్లకై విజయనగరం జిల్లా పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.