ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్దిపై దృష్టి పెట్టింది. మౌలిక వసతుల ప్రాజెక్టులు, జాతీయ రహదారులు, రైల్వే లైన్లు,ఆర్వోబీ నిర్మాణాలు వేగవంతమైన నేపథ్యంలో విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లా ప్రజల ఇబ్బందులు, ట్రాఫిక్ సమస్యలను గమనించి పెదమానాపురం రైల్వే గేటు వద్ద ఆర్వోబీ నిర్మాణం చేపట్టారు. రూ.21 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు జూన్ నెలాఖరుకు పూర్తయ్యేలా అధికారులు చర్యలు చేపట్టారు.