ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి రావలసిన ఉపాధిహామీ పథకం పెండింగ్ బిల్లులు కేంద్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని లోక్ సత్తాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి వివరాలతో కూడిన లేఖ రాసినట్లు తెలిపారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆ లేఖను విడుదల చేశారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా నాయకులు నాగభూషణం, రాజు, రమేష్, అప్పారావు పాల్గొన్నారు.