వరల్డ్ నర్సెస్ డే వేడుకలు రాగోలు జేమ్స్ హాస్పటల్‌లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నర్సింగ్ సిబ్బంది మరియు విద్యార్థినులు కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఆసుపత్రిలోని పలువురు సిబ్బందికి వారి విశేష సేవలందించినందుకు ప్రతిభ పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ పద్మావతి మాట్లాడుతూ నర్సింగ్ సిబ్బంది అంకితభావంతో, సేవా దృక్పథంతో పనిచేస్తూ ఆరోగ్య రంగంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఒక మంచి మార్గాన్ని ఏర్పరచుకోవాలని ఆకాంక్షించారు. అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ కె.సుధీర్ మాట్లాడుతూ వైద్య విద్యకు సేవా భావంతో పనిచేయడం ద్వారా మరింత గుర్తింపు తీసుకురావాలని సూచించారు.
మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ లక్ష్మీ లలిత విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ వారు అంకితభావంతో చదువుకొని మంచి భవిష్యత్తులో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. బొల్లినేని మెడిస్కిల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సి. హెచ్.నాగేశ్వరరావు మాట్లాడుతూ నర్సింగ్ విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలను సంపాదించి విదేశాలలో ఉద్యోగ అవకాశాలు పొందాలని, తద్వారా జేమ్స్ హాస్పటల్‌కు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ఈ వేడుకల్లో ఆపరేషన్స్ మేనేజర్ జ్యోత్స్న,AGM భాస్కర్ మరియు నర్సింగ్ సూపరింటెండెంట్ రాజశ్రీ తో పాటు పలువురు ఇతర సిబ్బంది కూడా పాల్గొన్నారు.