AP: రాజ్యసభకు విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే విజయసాయిరెడ్డి బీజేపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై రాష్ట్ర బీజేపీ చీఫ్ పురందేశ్వరి క్లారిటీ ఇచ్చారు. ‘విజయసాయిరెడ్డి బీజేపీలో చేరుతారని ప్రధాని మోదీ, అమిత్ షా చెప్పారా? ప్రతి సభ్యుడికి వారిద్దరూ అండగా ఉంటారు. ప్రధాని మోదీ, అమిత్ షాకు విజయసాయిరెడ్డి ధన్యవాదాలు తెలుపుతూ.. తనకు సపోర్ట్ చేశారని మాత్రమే చెప్పారు.’ అని పురందేశ్వరి తెలిపారు.