AP: తాజాగా వైసీపీకి రాజీనామా చేసిన విజయసాయి రెడ్డి ఏపీ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయమై ఆయన ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలతో చర్చించినట్లు సమాచారం. హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో ఉన్న షర్మిల నివాసానికి వెళ్లిన విజయసాయి దాదాపు 2 గంటలు ఆమెతో భేటీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సమావేశంలో ఇరువురు ఏం చర్చించారనేది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.