AP: రాజకీయాల్లో క్యారెక్టర్ ముఖ్యమని వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. శుక్రవారం ఎక్స్ వేదికగా కౌంటర్ వేశారు. ‘నేను వ్యక్తిగత జీవితంలోనూ విలువలు, క్యారెక్టర్ ఉన్న వాడిని. అందుకే ఎవరి ప్రలోభాలకు లొంగలేదు. భయం అనేది నాలో ఏ అణువు లోనూ లేదు. అందుకే ఎంపీ పదవికి, పార్టీ పదవులకు రాజీనామా చేశా. రాజకీయాలను వదులుకున్నా.’ అని పోస్టు పెట్టారు.