AP: ఇటీవల రాజకీయాలకు గుడ్ బై చెప్పిన విజయసాయిరెడ్డి అన్నంత పని చేశారు. తాజాగా వ్యవసాయంలో పనులు మొదలుపెట్టినట్లు ఆయన ఎక్స్ వేదికగా తెలిపారు. ‘‘నా ఉద్యాన పంటల కార్యకలాపాలను తాజాగా ప్రారంభించానని చెప్పడానికి సంతోషిస్తున్నాను’’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఓ జీప్, సింపుల్ డ్రెస్ తో వచ్చిన విజయసాయి ఆల్ ఈజ్ వెల్ అనే ఉద్దేశంతో బొటనవేలు పైకెత్తి చూపారు.