AP: నందమూరి తారకరత్న భార్య అలేఖ్య గురించి తెలిసే ఉంటుంది. విజయసాయిరెడ్డి ఈమెకు వరుసకు బాబాయి అవుతారు. తారకరత్న, అలేఖ్యల ప్రేమ వివాహానికి ఇరు కుటుంబాలను ఒప్పించడానికి విజయసాయిరెడ్డి కృషి చేసినట్లు అలేఖ్య గతంలో చెప్పారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్న విజయసాయిరెడ్డి అలేఖ్య కుటుంబంతో కలిసి కాసేపు సరదాగా గడిపారు. ఆ ఫోటోను ‘వీకెండ్ విత్ వీఎస్ఆర్’ అని పేర్కొంటూ సోషల్ మీడియాలో షేర్ చేశారు.