వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇటీవల రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. ఇప్పుడు ఆయన నందమూరి కుటుంబానికి దగ్గరవుతున్నారు. నందమూరి కుటుంబ సభ్యుడు దివంగత కథానాయకుడు తారకరత్న భార్య అలేఖ్య విజయసాయి రెడ్డితో పాటు దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. 'వీకెండ్ విత్ విఎస్ఆర్' అని పేర్కొన్నారు. విజయసాయి రెడ్డి మళ్లీ రాజకీయాల్లోకి వచ్చినా రాకున్నా... ఆయన కుమార్తె మాత్రం బీజేపీలో చేరే అవకాశం ఉందట.