వినేశ్ ఫోగాట్ చరిత్ర సృష్టించింది: ప్రధాని మోదీ

71చూసినవారు
వినేశ్ ఫోగాట్ చరిత్ర సృష్టించింది: ప్రధాని మోదీ
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ తరుపున పాల్గొన్న క్రీడాకారులతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెజ్లర్ వినేశ్ ఫోగాట్ ఫైనల్‌లోకి వెళ్లి చరిత్ర సృష్టించిందని ప్రశంసించారు. ఆమె పోరాటం అసామాన్యమని తెలిపారు. ఒలింపిక్స్ విజేతలకు దేశ ప్రజలంతా జేజేలు పలుకుతున్నారని వెల్లడించారు. భారత్‌లో 2036లో ఒలింపిక్స్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్