సోషల్ మీడియా పిచ్చిలో పడిపోయి.. యువత విపరీత పోకడలు పోతున్నారు. లైక్స్, వ్యూస్ కోసం దిక్కుమాలిన పనులు చేస్తున్నారు. ఇప్పుడు మరో షాకింగ్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అందులో ఒక వ్యక్తి తన మెడ వరకు మట్టిలో కప్పబడి ఉండటం చూడవచ్చు. అతని తల్లిగా చెబుతున్న మహిళ ఆ వ్యక్తికి ఆహారం తినిపిస్తుండగా.. పక్కనే కూర్చున్న మరో మహిళను అతడి భార్యగా చెబుతున్నారు. ఈ వీడియో చూసిన నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.