విరాట్ కోహ్లీ తనకు మద్దతుగా నిలిచాడని ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ పేర్కొన్నారు. ఆర్సీబీ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తాను తీవ్ర ఒత్తిడికి గురైనట్లు రజత్ పటీదార్ గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో విరాట్‌కోహ్లీ తనకు మద్దతుగా నిలిచాడని పటీదార్ వివరించారు. పటీదార్ సారథ్యంలో RCB ఐపీఎల్ 2025లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. 8 మ్యాచ్‌ల్లో నెగ్గిన RCB పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది.