విశాఖ మేయర్ హరివెంకట కుమారి కంటతడి (వీడియో)

51చూసినవారు
విశాఖ మేయర్ హరి వెంకటకుమారి భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. తనను పడగొట్టేందుకు తన సామాజిక వర్గానికి చెందిన నేతలే కుట్ర చేస్తున్నారంటూ ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ గుర్తుపై విజయం సాధించినప్పటికీ, ఇప్పుడు అదే పార్టీ నేతలే అవిశ్వాసానికి సిద్ధమవుతున్నారని తెలిపారు. "ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదు... నన్ను తొలగించేందుకు కంకణం కట్టుకున్నారు" అంటూ ఎమోషనల్‌ అయ్యారు.

సంబంధిత పోస్ట్