AP: విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆందోళనకు దిగారు. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపునకు నిరసనగా అఖిలపక్ష కార్మిక సంఘాలు ఉద్యమానికి నడుం బిగించాయి. ఆదివారం గాజువాకలో భారీ ఆందోళనకు పిలుపునిచ్చాయి. దాంతో కార్మికులు భారీగా చేరుకుని ఆందోళన చేస్తున్నారు. నిన్న 900 మంది కాంట్రాక్ట్ కార్మికులను యాజమాన్యం తొలగించింది. తమ సమస్యలను వెంటనేేే పరిష్కరించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.