వైసీపీలో చేరిన విశాఖ టీడీపీ కార్పొరేట‌ర్ పూర్ణిమ శ్రీధర్

82చూసినవారు
వైసీపీలో చేరిన విశాఖ టీడీపీ కార్పొరేట‌ర్  పూర్ణిమ శ్రీధర్
AP: టీడీపీకి విశాఖలో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన 41 వ వార్డు కార్పొరేటర్‌ కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్ వైసీపీలో చేరారు. మంగ‌ళ‌వారం తాడేప‌ల్లిలోని పార్టీ అధినేత, వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో పూర్ణిమ శ్రీధర్ పార్టీలో చేరారు. జగన్ ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర రీజనల్ కో-ఆర్డినేటర్‌ కురసాల కన్నబాబు, విశాఖ జిల్లా అధ్యక్షుడు కే కే రాజు, ఇంఛార్జ్‌ వాసుపల్లి గణేష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్