విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ రావాలన్నది ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నమని వైయస్సార్సీపి అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం ఇంచార్జ్ కరణం ధర్మశ్రీ పేర్కొన్నారు. కేంద్రం నూతనంగా ప్రకటించిన విశాఖ రైల్వే డివిజన్ ఏర్పాటుపై ఆయన గురువారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. విశాఖ రైల్వే డివిజన్ విశాఖ కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ పరిధిని కేంద్ర రైల్వే శాఖ నిర్ణయించిందన్నారు. దీనిపై అసహనం వ్యక్తం చేశారు.