ఈ నెల 19వ తేదీ నుంచి జరుగనున్న పదో తరగతి అడ్వాన్సడ్ సప్లిమెంటరీ పరీక్షలకు విద్యార్డులకు యిబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని, పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో పరీక్షల ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టరు వెబెక్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. పరీక్షల నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు