అనకాపల్లి: కోటి రూపాయలు విలువైన సెల్ ఫోన్లు రికవరీ

84చూసినవారు
అనకాపల్లి: కోటి రూపాయలు విలువైన సెల్ ఫోన్లు రికవరీ
అనకాపల్లి జిల్లా పోలీసులు 9వ విడతలో రికవరీ చేసిన కోటి రూపాయలు విలువ గల 503 మొబైల్ ఫోన్లను బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మొబైల్ ఫోన్ రికవరీ మేళాలో ఎస్పీ తుహిన్ సిన్హా సమక్షంలో బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఇప్పటివరకు మొత్తం సుమారు 4,500 ఫిర్యాదులు నమోదు కాగా, మొత్తం 9 విడతల్లో 2, 711 మొబైల్ ఫోన్లను సుమారు 4 కోట్ల, 07 లక్షల రూపాయల విలువైనవి పొగోట్టుకున్నారన్నారు.

సంబంధిత పోస్ట్