స్వర్ణ ఆంధ్ర- స్వచ్చ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం బాటజంగాలపాలెం గ్రామంలో బీట్ ది హీట్ నినాదంతో నిర్వహించిన కార్యక్రమాలలో జిల్లా కలెక్టరు విజయ కృష్ణన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నీటి కుండీలను, తడి చెత్త పొడి చెత్త కేంద్రాలను, వైద్య శిబిరాన్ని తదితరు కార్యక్రమాలను ఆమె పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. ప్రతి ఒక్కరు పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కోరారు.