అనకాపల్లి శారదానదిలో నీరు కలుషితం అయిన కారణంగా ఈ నెల 7, 8 తేదీల్లో మంచినీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని జీవీఎంసీ కార్యనిర్వాహక ఇంజనీర్ సూరిశెట్టి శేఖర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తుమ్మపాల హెడ్ వాటర్ వర్క్స్ వద్ద నీరు రంగుమారడం గమనించడం జరిగిందని అన్నారు. గోవాడ చక్కెర కర్మాగారం యాజమాన్యం శుద్ది చేయకుండా రసాయనాలను నదిలో వదలడం వలన ఈ సంక్షోభం ఏర్పడిందని తెలిపారు.