అనకాపల్లి టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్ కార్యక్రమంలో రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎల్. వెంకట గోవింద సత్యనారాయణ, గవర కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర పాల్గొని టీడీపీ శ్రేణులు, ప్రజలనుండి వినతులు స్వీకరించారు. సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకే గ్రీవెన్స్ సెల్ నిర్వహిస్తున్నట్టు వారు తెలిపారు. వచ్చిన సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామన్నారు