అనకాపల్లి: "తుమ్మపాల షుగర్స్ ను అమ్మకానికి పెట్టడం సరికాదు"

79చూసినవారు
అనకాపల్లి: "తుమ్మపాల షుగర్స్ ను అమ్మకానికి పెట్టడం సరికాదు"
రైతులు షేర్ క్యాపిటల్తో నిర్మించిన తుమ్మపాల వీవీ రమణ సుగర్ ఫ్యాక్టరీని అమ్మకానికి పెట్టడం సరైన పద్ధతి కాదని ఫ్యాక్టరీ పరిరక్షణ కమిటీ కన్వీనర్ విల్లూరి పైడారావు అన్నారు. బుధవారం స్థానిక సీపీఎం కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పైడారావు మాట్లాడుతూ గత ఎన్నికల ముందు ఫ్యాక్టరీని ప్రారంభిస్తామని వాగ్దానం చేసిన సీఎం, డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యే ఈ అంశంపై స్పందించాలన్నారు.

సంబంధిత పోస్ట్