పోలవరం ఎడమ కాలువ భూసేకరణకు పరిహారం విషయం తేల్చకుంటే భూములిచ్చేది లేదని రైతులు స్పష్టం చేశారు. నాగులాపల్లి శివారు జగ్గయ్యపేటలో భూముల పరిశీలనకు పోలవరం ప్రాజెక్టు ఇరిగేషన్ అధికారులు శనివారం రైతులతో సమావేశమయ్యారు. తమ అభ్యంతరాలను అధికారులకు తెలిపారు. భూ సేకరణకు సంబంధించి పత్రికల్లో వార్తలు వచ్చాయన్నారు. వాస్తవానికి జగ్గయ్యపేట భూములను పోలవరం ఎడమ కాలువ భూ సేకరణ గతంలోనే అధికారులు ఆధీనంలోకి తీసుకున్నారన్నారు.