అనకాపల్లి: ఘనంగా అమ్మవారి సారె ఊరేగింపు

అనకాపల్లి పట్టణంలోని విజయరామరాజుపేటలో శ్రీ మరిడిమంబ అమ్మవారి ఆలయం 9 వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం అమ్మవారికి భక్తులు సారె సమర్పించారు. విజయరామరాజుపేట చుట్టుపక్కల గ్రామాలు నుండి మహిళలు వివిధ రకాల పిండి వంటలు, స్వీట్లు తయారుచేసి ఘనంగా ఊరేగింపు జరిపి అమ్మవారికి సమర్పించారు. గ్రామ కమిటీ చైర్మన్ ఆళ్ల శివరామ సత్యనారాయణ, కార్యదర్శి పలకా రాము, ఉపాధ్యక్షులు బొబ్బిలి అప్పారావు పాల్గొన్నారు.