అనకాపల్లి జిల్లాలో మాతా, శిశు మరణాలు సంభవించకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టరు విజయ కృష్ణన్ వైద్యాధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజాసర్వే, మాతృశిశుమరణాలు, వ్యాధినిరోధకటీకాలు, మలేరియా, డెంగ్యూ తదితర అంశాలపై వైద్యాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టరు మాట్లాడుతూ తదుపరి సమావేశానికి సమగ్ర సమాచారంతో రావాలన్నారు.