వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ ఈ ఏడాది ప్రవేశపెట్టిన శుభమస్తు పథకం ద్వారా నిరుపేద ఆర్యవైశ్య పిల్లల పెళ్లికి ఆర్థిక సాయం అందిస్తున్నారు. తాజాగా శుక్రవారం పాయకరావుపేట వనిత వాసవి క్లబ్ లో ఉన్న ఒక నిరుపేద కుటుంబానికి ఆడపిల్ల వివాహం నిమిత్తం 25 వేల రూపాయలను జిల్లా గవర్నర్ కే పూర్ణిమ చేతి మీదగా ఆ కుటుంబానికి అందజేశారు. దీంతో వారు ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ వారికి ధన్యవాదాలు తెలిపారు.