ఆంధ్రప్రదేశ్ తెలుగునాడు వైద్య, ఆరోగ్య ఉద్యోగుల సంఘం నూతన సంవత్సరం -2025 క్యాలెండర్స్ ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డా. పి. రవికుమార్ శనివారం అనకాపల్లి జిల్లా కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల తమ సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపిటిఎన్టియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. శ్రీనివాసచార్యులు తదితరులు పాల్గొన్నారు.