చింతపల్లి మండలంలోని కొత్తపాలెం పంచాయతీ పరిధి కడశిల్ప గ్రామానికి వెళ్లే వంతెన ప్రమాదకరంగా మారింది. వంతెనకు ఇరువైపులా ఉండాల్సిన రక్షణ గోడలు ధ్వంసం కావడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని భయాందోళనలు చెందుతున్నామని కడశిల్ప గిరిజనులు పాంగి. దోహన్ రావు దేవదాసు తదితరులు బుధవారం తెలిపారు. అధికారులు స్పందించి ప్రమాదాలకు నిలయంగా మారిన ఈ వంతెనకు మరమ్మత్తులు చేపట్టాలని వారు కోరుతున్నారు.