ఉమ్మడి విశాఖ జిల్లా నూతన ఎమ్మెల్సీగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణని అనకాపల్లి మాజీ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బివి సత్యవతి అభినందించారు. విశాఖపట్నంలో వారి నివాసం నందు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలియజేశారు. శాసనమండలిలో ప్రజావాణిని సమర్థవంతంగా నడిపించాలని, ప్రజాసమస్యల పరిష్కారానికి పాటుపడాలని ఆమె కోరారు.