రావికమతం మండలం కొత్తకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ రజిని ఆధ్వర్యంలో శుక్రవారం జాతీయ డెంగ్యూ దినోత్సవం ర్యాలీ , అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రజిని మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధి లక్షణాలను వివరించారు. ఈ సందర్భంగా డెంగ్యూను ఓడించండి, మూతలు పెట్టండి, పరిశీలించండి, శుభ్రం చేయండి , మూడు పద్ధతుల ద్వారా వ్యాధిని అరికట్టండి నినాదాలు చేసి అవగాహన కల్పించారు.