రహదారి భద్రత ప్రమాణాలు పట్ల అవగాహన, ఆచరణతోనే జిల్లాలో రహదారి ప్రమాదాలను నియంత్రించవచ్చునని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా బుధవారం మీడియా సమావేశంలో తెలిపారు. రహదారి భద్రతమాసోత్సవాల సందర్భంగా రహదారి భద్రతకు ప్రాధాన్యత కల్పించి, భద్రత చర్యలు చేపట్టాలని, ప్రజలకు రహదారి భద్రత పట్ల అవగాహన కల్పించాలని
అధికారులను ఆదేశించారు. జిల్లాలో జనవరి 16 నుండి ఫిబ్రవరి 15 వరకు రహదారి భద్రత మాసోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు.