అనంతగిరి మండలంలోని కాశీపట్నం పంచాయతీలోని సారవానిపాలెంలో ఏపీసీఎన్ఏఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించారు. ఐసిఆర్పి సూర్యనారాయణ మాట్లాడుతూ. రసాయనలతో పండించిన పంటలు తినడం వల్ల వ్యాధులు తెచ్చుకుంటున్నారన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండిస్తున్న పంటలు తినడం ద్వారా ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయన్నారు. ఏపీసీఎన్ఎఫ్ యూనిట్ ఇన్చార్జ్ గంగమ్మ సింహాచలం ఈశ్వరరావు తదితరులున్నారు.