అల్లూరి జిల్లా అరకులోయ ఏజెన్సీలో కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. వాతావరణంలో రెండుమూడు రోజులుగా అనూహ్య మార్పులు కనిపిస్తున్నాయి. ఉదయం రాత్రి చలి వణికిస్తుండగా మధ్యాహ్నం ఎండ దంచేస్తోంది. బుధవారం వేకువజామున పొగమంచు దుప్పటి దట్టంగా కమ్మేసింది. వాహనదారులు ప్రమాదం జరుగుతుందని భయంతో లైట్లు వేసుకొని రాకపోకలు కొనసాగించారు. ఉదయం వేళలో పాఠశాలకు విద్యార్థులు ఉద్యోగవ్యాపారాల నిమిత్తం వెళ్లేవారు ఇబ్బందులు పడ్డారు.