జగన్ రెడ్డి ఐదేళ్ల నిరంకుశ పాలనలో రాష్ట్ర మనిరంగలో అధోగతి పాలైందని రాష్ట్ర జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ అన్నారు. ఆదివారం ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం ను గెలిపించాలని తణుకు నియోజకవర్గం తణుకు పట్టణంలోని 4, 5 వార్డుల్లో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ప్రతి ఒక్క ఓటరును కలిసి కరపత్రాలు పంపిణీ చేస్తూ ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.