అరకులోయ మండలంలోని మాడగడ పంచాయతీ పరిధి దొరగుడకి రహదారి సౌకర్యం కల్పించాలని గిరిజనులు కోరుతున్నారు. గ్రామం ఏర్పడి 30 సంవత్సరాలు అవుతున్న సరైన రహదారి సౌకర్యం లేక అత్యవసర పరిస్థితుల్లో వాహనాలు రాక ద్విచక్రవాహనాలతో పొలంగట్టు వెంట పట్టణ ప్రాంతాలకు చేరుకోవాల్సిన పరిస్థితి నెలకొందని గిరిజనులు బుధవారం తెలిపారు. అధికారులు స్పందించి దొరగుడకి రహదారి సౌకర్యం కల్పించి కష్టాలు తీర్చాలని గిరిజనులు కోరుతున్నారు.