హుకుంపేట: ఎంపీపీ పాఠశాల భవన నిర్మాణ పనులు ప్రారంభం

60చూసినవారు
హుకుంపేట: ఎంపీపీ పాఠశాల భవన నిర్మాణ పనులు ప్రారంభం
హుకుంపేట మండలంలోని పట్టం పంచాయతీ పరిధి కుమ్మరిపుట్టు గ్రామంలో నూతన ఎంపీపీ పాఠశాల భవన నిర్మాణానికి గురువారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ కృష్ణ జనసేన పార్టీ మండల నాయకుడు చిరంజీవి పాల్గొని కొబ్బరికాయలు కొట్టి నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం సర్పంచ్ కృష్ణ మాట్లాడుతూ.. కుమ్మరిపుట్టు గ్రామంలో పాఠశాల భవనం నిర్మాణం చేపట్టనుండడంతో విద్యార్థుల కష్టాలు తీరనుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్