హుకుంపేట: డ్రైనేజీలు మంజూరు చేయాలని వినతి

51చూసినవారు
హుకుంపేట మండలంలోని ముసిరిపాడులో డ్రైనేజీలు మంజూరు చేయాలని గిరిజనులు మంగళవారం కోరారు. స్థానిక గిరిజనుడు నారాయణరావు మాట్లాడుతూ గ్రామంలో డ్రైనేజీల నిర్మాణం చేపట్టకపోవడంతో ఇళ్లల్లో వాడే నీరు ఎక్కడికక్కడ నిల్వ ఉండిపోయి ఆ నీటిలో దోమలు పెరిగి రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి ముసిరిపాడు గ్రామంలో డ్రైనేజీలు నిర్మాణం చేపట్టాలని కోరారు. ఇందులో ముసిరిపాడు గిరిజనులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్